Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • బోర్ కొడుతోందంటున్న కాజల్
  • బయోపిక్ కి మాధవన్ దర్శకత్వం 
  • మణిరత్నం సినిమాలో నాని?
  • నెలాఖరు నుంచి నితిన్ 'భీష్మ'

*  ప్రస్తుతం చేయబోయే సినిమాల్లో కొత్తదనం కోసం ఆశిస్తున్నాను.. అంటోంది అందాలభామ కాజల్ అగర్వాల్. 'ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు, ఒకే తరహా పాత్రలు చేయడం బోర్ కదా? అందుకే ప్రస్తుతం కొత్త తరహా పాత్రల కోసం చూస్తున్నాను. అటువంటి పాత్రలకే ప్రాధాన్యతను ఇస్తున్నాను' అని చెప్పింది.
*  ప్రముఖ నటుడు మాధవన్ తాను నటిస్తున్న చిత్రానికి దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్ గా వివిధ భాషల్లో రూపొందుతున్న 'రాకెటరీ- ద నంబి ఎఫెక్ట్' చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా, దానికి దర్శకత్వం కూడా వహిస్తున్నాడు.
*  ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించే ఛాన్స్ తాజాగా హీరో నానికి వచ్చినట్టు తెలుస్తోంది. మణిరత్నం తన తదుపరి చిత్రం కోసం నానిని సంప్రదిస్తున్నట్టు చెబుతున్నారు.
*  నితిన్ హీరోగా నటించే 'భీష్మ' చిత్రం షూటింగ్ ఈ నెలాఖరు నుంచి జరుగుతుంది. చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసినట్టు సమాచారం. ఇందులో రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది.

Kajal Agarwal
Madhavan
Maniratnam
Nani
  • Loading...

More Telugu News