Aravind Kejriwal: తన పేరు, చిరునామా చెప్పి.. దాడి చేస్తానంటూ కేజ్రీవాల్‌కు బెదిరింపులు

  • తన పేరు భోలు అని చెప్పిన సదరు వ్యక్తి 
  • వికాస్ పురి నుంచి మాట్లాడుతున్నానని వెల్లడి
  • ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు

ఇటీవల ఢిల్లీ సచివాలయంలో ఓ వ్యక్తి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై కారం చల్లిన ఘటన మరువక ముందే.. మరో వ్యక్తి ఆయనపై బెదిరింపులకు పాల్పడ్డాడు. తన పేరు, చిరునామా చెప్పి మరీ కేజ్రీవాల్ నివాసానికి ఫోన్ చేసి దాడి చేస్తానని బెదిరించాడు.

తన పేరు భోలు అని.. వికాస్ పురి నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడని భద్రతా సిబ్బంది తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని కేజ్రీవాల్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలర్ ఐడీ లేకపోవడంతో వివరాలేవీ లభ్యం కావడం లేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. 

Aravind Kejriwal
Bholu
Vikas puri
Delhi
Police
  • Loading...

More Telugu News