Vijayawada: వీడిన విజయవాడ బాక్స్ మిస్టరీ!

  • మంగళగిరికి తరలించిన బాంబ్ స్క్వాడ్
  • రాగి బిందె, బ్యాటరీ, వైర్ల గుర్తింపు
  • పోలీస్ కమిషనరేట్‌కు తరలింపు

విజయవాడలో కలకలం రేపిన బాక్స్ మిస్టరీ వీడింది. ముందుగా విజయవాడలో ఈ బాక్సును తెరవాలని భావించిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, బాంబ్ స్క్వాడ్.. దానిని తెరవడం కారణంగా ఏదైనా పేలుడు సంభవిస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆలోచించి మంగళగిరికి తరలించారు. అక్కడ ఓ నిర్జన ప్రదేశానికి బాక్సును తీసుకెళ్లి దానిని తెరిచారు.

అయితే ముందుగా భయపడినట్టుగా బాక్సులో పేలుడు పదార్థాల్లాంటివేమీ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ బాక్సులో ఓ రాగి బిందె, బ్యాటరీ, వైర్లు ఉన్నట్టు కనుగొన్నారు. వెంటనే బాక్సులో లభించిన వస్తువులను విజయవాడ పోలీస్ కమిషనరేట్‌కు తరలించారు. అయితే బాక్సులో లభించిన వస్తువులను ఎందుకు కొన్నారు? వాటిని ఎక్కడికి తీసుకెళుతున్నారనే విషయాలపై ఇప్పటికే పోలీసులు విచారణ ప్రారంభించారు.

Vijayawada
Box
Battery
Bomb Squad
Police Commissionarate
Mangalagiri
  • Loading...

More Telugu News