Andhra Pradesh: నితీశ్ జీ.. మా చేపలు, రొయ్యలపై నిషేధం ఎత్తివేయండి!: చంద్రబాబు లేఖ

  • ఏపీ సముద్ర ఉత్పత్తుల్లో ఫార్మాలిన్ అవశేషాలు
  • అలాంటివి ఏదీ లేదన్న చంద్రబాబు
  • కావాలంటే తనిఖీలకు అధికారులను పంపాలని విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిహార్ సీఎం నితీశ్ కుమార్ కు లేఖ రాశారు. ఏపీ నుంచి చేపలు, రొయ్యల దిగుమతిపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. ఏపీ నుంచి దిగుమతి అవుతున్న చేపలు, రొయ్యల్లో ప్రమాదకరమైన ఫార్మాలిన్ అనే రసాయనం పరిమితికి మించి ఉన్నట్లు తనిఖీల్లో తేలడంతో బిహార్ ఏపీ సముద్ర ఉత్పత్తులపై గతంలో నిషేధం విధించింది.

ఈ విషయమై చంద్రబాబు స్పందిస్తూ.. తమ ఉత్పత్తుల్లో ఫార్మాలిన్ వాడటం లేదని స్పష్టం చేశారు. రొయ్యలు, చేపల ఉత్పత్తుల తనిఖీల కోసం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. అవసరమైతే తనిఖీల కోసం బిహార్ నుంచి అధికారులను పంపాలని కోరారు. ఏపీ సముద్ర ఉత్పత్తులపై విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.

Andhra Pradesh
Chandrababu
bihar
nitish kumar
fish
prawn
sea food
ban
fharmalin
chemical
  • Loading...

More Telugu News