siva kumara swamy: సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి నిర్యాణం.. కర్ణాటకలో రేపు సెలవు ప్రకటించిన ప్రభుత్వం!

  • సిద్ధగంగ మఠాధిపతిగా ఆధ్యాత్మిక సేవలు
  • మూడ్రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన ప్రభుత్వం
  • రేపు సాయంత్రం అంత్యక్రియల నిర్వహణ

సిద్ధగంగ మఠాధిపతి శివకుమార స్వామి(111) ఈరోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని సిద్ధగంగ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్వామి ఆరోగ్యం ఈరోజు విషమించడంతో కర్ణాటక సీఎం కుమారస్వామి, ఉపముఖ్యమంత్రి జి. పరమేశ్వర, హోంమంత్రి ఎంబీ పాటిల్ ఆయన్ను పరామర్శించారు.

కాగా శివకుమార స్వామి మృతి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మూడ్రోజులు సంతాప దినాలుగా, రేపు సెలవుగా ప్రకటించింది. మరోవైపు రేపు సాయంత్రం 4 గంటలకు శివకుమార స్వామి అంత్యక్రియలు జరుగుతాయని మఠానికి చెందిన అధికారులు తెలిపారు. శివకుమార స్వామి కర్ణాటకలోని శక్తిమంతమైన లింగాయత్ సామాజికవర్గానికి చెందినవారు.

siva kumara swamy
dead
Karnataka
kumara swamy
Chief Minister
holiday
  • Loading...

More Telugu News