Andhra Pradesh: ఏపీలో ఎన్నికల నాటికి బీజేపీలో గుండు సున్నా మాత్రమే మిగులుతుంది!: బుద్ధా వెంకన్న సెటైర్లు

  • ఏపీకి కేంద్రం నిధులు ఇవ్వట్లేదు
  • కన్నా తన ఆస్తులను ప్రకటించాలి
  • విజయవాడలో మీడియాతో టీడీపీ నేత

కేంద్ర ప్రభుత్వం ఏపీకి నిధులను కేటాయించడం లేదని టీడీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. నిధులు ఇవ్వకపోగా, ఇప్పుడు ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలకు దమ్ముంటే ఏపీకి నిధుల విడుదలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు తన ఆస్తులు ఎంత ఉన్నాయో, ఇప్పుడు ఎంతకు చేరుకున్నాయో బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ చెప్పాలని డిమాండ్ చేశారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కన్నా లక్ష్మీనారాయణ దెబ్బకు ఏపీలో బీజేపీ ఖాళీ అయిపోతోందని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. ఎన్నికలకు 100 రోజులు ఉండగానే బీజేపీని చాలామంది వీడారనీ, ఎన్నికలు జరిగే నాటికి బీజేపీలో కన్నా నాయకత్వంలో గుండు సున్నా మాత్రమే మిగులుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిధులు కేటాయించకుండా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బీజేపీ విమర్శలు గుప్పించడం దారుణమన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ మరోసారి ఘనవిజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు.

Andhra Pradesh
Telugudesam
BJP
budha
venkanna
kanna
lakshmi narayana
  • Loading...

More Telugu News