: మహిళ, పురుషుడిని ఒంటరిగా వదిలేస్తే...?


న్యాయపీఠంపై కూర్చున్న న్యాయమూర్తి మాటలకు ఎంతో ప్రాధాన్యం, విలువ ఉంటాయి. అలాంటి స్థానంలో ఉన్న వారు ఆచి, తూచి మాట్లాడాలి. కానీ, కాంచీపురం న్యాయమూర్తి మాత్రం తన వ్యాఖ్యలతో ఏకంగా తమిళనాడు హైకోర్టు ఆగ్రహానికి గురయ్యారు. ఒక హత్యకేసును విచారిస్తున్న కాంచీపురం రెండవ సెషన్స్ జడ్జి ఇలా అన్నారు. ''ఒక పురుషుడు, ఒక స్త్రీని ఒంటరిగా విడిచి పెడితే వారు శృంగారంలో పాల్గొంటారు’’ అని అనేశారు. ఈ అభిప్రాయం ఆధారంగానే హత్యకు గురైన మహిళ, హత్యా నిందితుడు శృంగారం చేసుకుని ఉంటారని భావిస్తూ నిందితుడు రాజుకు న్యాయూమూర్తి యావజ్జీవ ఖైదును విధించారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు హైకోర్టు మండిపడింది. ఊహలు, పరిస్థితులను బట్టి న్యాయపరంగా ఒక నిర్ణయానికి రాకూడదని సూచించింది.

  • Loading...

More Telugu News