YSRCP: పలాస ఎమ్మెల్యే శివాజీపై జగన్ తీవ్ర ఆరోపణలు.. కోర్టుకెక్కేందుకు సిద్ధమైన టీడీపీ ఎమ్మెల్యే

  • పలాస బహిరంగ సభలో శివాజీపై జగన్ తీవ్ర ఆరోపణలు
  • తీవ్రంగా పరిగణించిన శివాజీ
  • త్వరలోనే లీగల్ నోటీసులు పంపాలని నిర్ణయం

ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా జగన్ తనపై చేసిన ఆరోపణలపై శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీ స్పందించారు. తనపైనా, తన కుటుంబంపైనా జగన్ చేసిన నిరాధార ఆరోపణలపై కోర్టుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తొలుత లీగల్ నోటీసులు పంపాలని యోచిస్తున్నారు.

 శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర సమయంలో పలుచోట్ల నిర్వహించిన బహిరంగ సభల్లో జగన్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపైనా, స్థానిక టీడీపీ నేతలపైనా పలు ఆరోపణలు చేశారు. పలాసలో నిర్వహించిన బహిరంగ సభలో గౌతు శ్యామ సుందర శివాజీపైనా విరుచుకుపడ్డారు. జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన శివాజీ ఆయనకు లీగల్ నోటీసులు పంపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

YSRCP
YS Jagan
Palasa
Srikakulam District
gouthu syam sunder sivaji
  • Loading...

More Telugu News