vijayashanthi: మీది ఫెడరల్ ఫ్రంట్ కాదు.. ఫేడప్ ఫ్రంట్: కేసీఆర్‌ను ఎద్దేవా చేసిన విజయశాంతి
- కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌పై విజయశాంతి విమర్శలు
- ఆయన కలిసిన నేతలంతా మహాకూటమితోనే
- తెలుగు రాష్ట్రాలకే ఫెడరల్ ఫ్రంట్ పరిమితం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విమర్శలు సంధించారు. కేసీఆర్‌ది ఫెడరల్ ఫ్రంట్ కాదని ‘ఫేడప్ ఫ్రంట్’ అని ఎద్దేవా చేశారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశమంతా తిరిగిన కేసీఆర్ చివరికి వైసీపీ మద్దతును మాత్రమే పొందగలిగారన్నారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి, డీఎంకే చీఫ్ స్టాలిన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ వంటి వాళ్లను కలిసి ఫెడరల్ ఫ్రంట్‌లోకి ఆహ్వానించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. వారంతా కోల్‌కతాలో జరిగిన మహాకూటమి సభకు హాజరై కేసీఆర్‌కు ఝలక్కిచ్చారన్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ తెలుగు రాష్ట్రాలకే పరిమితమయ్యే సూచనలు ఉన్నాయని విజయశాంతి చురక అంటించారు.