Vangaveeti Radhakrishna: నాలుగు నెలలుగా ఓర్పుతో ఉన్నా: వంగవీటి రాధా

  • కష్టపడి పనిచేసినా జగన్ గుర్తించట్లేదు
  • టికెట్ విషయమై స్పందించట్లేదు
  • గతంలోనే రాజీనామా లేఖను పంపా

గతంలోనే తన రాజీనామా లేఖను వైఎస్ జగన్‌కు పంపినట్టు వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. నేటి సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను రాధా పంచుకున్నారు. తన అనుచరులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. వైసీపీలో కష్టపడి పని చేసినప్పటికీ జగన్ గుర్తించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను నాలుగు నెలలుగా ఓర్పుతో ఉన్నానని.. అయినా కూడా విజయవాడ సెంట్రల్ టికెట్ విషయమై జగన్ స్పందించలేదని ఆయన స్పష్టం చేశారు.

Vangaveeti Radhakrishna
YSRCP
Jagan
Vijayawada
  • Loading...

More Telugu News