Chandrababu: అవినీతి, ఆర్భాటం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు: జీవీఎల్ విమర్శలు

  • పథకాలకు పసుపు ముసుగు వేశారు
  • అన్ని ముసుగులూ తొలగిస్తాం
  • ఏపీకి వేల కోట్ల నిధులిస్తోంది

అవినీతి, ఆర్భాటం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నేడు ఆయన గుంటూరులో మాట్లాడుతూ.. మోదీ పథకాలకు చంద్రబాబు పసుపు ముసుగు వేశారని.. అన్ని ముసుగులూ తొలగించి ఆయన బండారాన్ని బయట పెడతామని పేర్కొన్నారు. వారానికో కేంద్రమంత్రిని రాష్ట్రానికి తీసుకువచ్చి వారి ద్వారానే వాస్తవాలు వెల్లడిస్తామన్నారు. ఏపీకి కేంద్రం వేల కోట్ల నిధులిస్తోందని.. గృహ నిర్మాణంలో జరుగుతున్న అవినీతికి అంతులేదని జీవీఎల్ పేర్కొన్నారు.

Chandrababu
GVL Narasimharao
Narendra Modi
Central Minister
Guntur
  • Loading...

More Telugu News