Koppula Eshwar: కేసులను ఉపసంహరించుకుని.. మాతో కలసి రండి: కొప్పుల ఈశ్వర్

  • ప్రాజెక్టులపై కేసులను ఉపసంహరించుకోండి
  • ఆర్థిక వృద్ధి రేటులో తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది
  • కరెంట్ కోతల స్థితి నుంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఎదిగాం

రాష్ట్రంలో నిర్మితమవుతున్న ప్రాజెక్టులపై కోర్టులో వేసిన కేసులను ఉపసంహరించుకుని తమతో కలసి రావాలని విపక్షాలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ కోరారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరెంట్ కోతల స్థితి నుంచి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఎదిగామని చెప్పారు. ఆర్థిక వృద్ధి రేటులో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నిలిచిందని అన్నారు. రైతులకు పంట పెట్టుబడి ఇస్తున్నామని తెలిపారు. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే... వారి కుటుంబానికి భరోసా కల్పించేందుకు రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా సాగుతోందని అన్నారు.

Koppula Eshwar
TRS
projects
  • Loading...

More Telugu News