jc diwakar reddy: జేసీ దివాకర్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారు: టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి

  • అనంతపురంలో జయహో బీసీ సభ
  • హాజరైన టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి
  • జేసీపై మరోసారి ఘాటు విమర్శలు

అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిల మధ్య ఉన్న విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. బీసీల కోసం టీడీపీ అహర్నిశలు కష్టపడుతుంటే... దివాకర్ రెడ్డి మాత్రం అక్రమంగా ఇల్లు, ఇంటి స్థలాలను సంపాదించుకుంటున్నారని విమర్శించారు. అనంతపురంలో ఈరోజు 'జయహో బీసీ' సభ జరిగింది. ఈ సభలో ప్రభాకర్ మాట్లాడుతూ, దివాకర్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. చాలా కాలంగా ఇరువురు నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరినీ పిలిపించుకుని మాట్లాడారు. అయినా, విభేదాలు మాత్రం సమసిపోలేదు.

jc diwakar reddy
prabhakar chowdary
Telugudesam
ananthapuram
  • Loading...

More Telugu News