bjp: బీజేపీకి రాజీనామా.. రేపు జనసేనలో చేరనున్న ఎమ్మెల్యే ఆకుల

  • గత కొంత కాలంగా ఆకుల పార్టీ మారడంపై వార్తలు 
  • ఎమ్మెల్యే, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా
  • రేపు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిక

గత కొన్ని రోజులుగా కొనసాగిన ఊహాగానాలకు తెరపడింది. అందరూ భావించినట్టుగానే బీజేపీ రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు ఫ్యాక్స్ ద్వారా పంపారు.

ఈ సందర్భంగా ఆకుల సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లో సంతకం చేసిన రాజీనామా లేఖను స్పీకర్ కోడెలకు పంపానని తెలిపారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు పంపానని చెప్పారు. రేపు ఉదయం జనసేన పార్టీలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో చేరుతానని తెలిపారు.

bjp
mla
akula satyanarayana
resign
janasena
Pawan Kalyan
  • Loading...

More Telugu News