ys rajasekhar reddy: వైయస్ తెచ్చిన ఆరోగ్యశ్రీ చాలా గొప్ప పథకం.. మంచి పథకాలను మెచ్చుకోవాల్సిందే: కేసీఆర్

  • ఇదే విషయాన్ని మోదీకి కూడా చెప్పా
  • గొప్ప పథకాన్ని అభినందించడానికి నాకు భేషజాలు లేవు
  • ఆయుష్మాన్ భారత్ మాకు వద్దని మోదీకి తెలిపాను

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ పథకం చాలా గొప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కితాబిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తూ... గొప్ప పథకాన్ని అభినందించడానికి తనకు ఎలాంటి భేషజాలు లేవని చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ను తాము అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను ప్రధాని మోదీకి కూడా తెలిపానని అన్నారు.

ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ పథకం చాలా బాగుందని... దాన్ని మరింత మెరుగు పరిచి తాము కొనసాగిస్తున్నామని... ఈ పరిస్థితుల్లో తమకు ఆయుష్మాన్ భారత్ అవసరం లేదని మోదీకి చెప్పానని కేసీఆర్ తెలిపారు. 108 అంబులెన్స్ పథకం కూడా చాలా బాగుందని ఆయన చెప్పారు.

ys rajasekhar reddy
arogyasri
kcr
modi
ayushman bharat
TRS
congress
bjp
  • Loading...

More Telugu News