Srija: చిరంజీవి మనవరాలికి నామకరణం!

  • క్రిస్మస్ నాడు పాపకు జన్మనిచ్చిన శ్రీజ
  • తాజాగా పాపకు నామకరణ మహోత్సవం
  • 'నవిష్క' అని పేరు పెట్టామని తెల్పిన కల్యాణ్ దేవ్

మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కొత్తగా వచ్చిన వంశాంకురం, ఆయన చిన్న కూతురు శ్రీజకు పుట్టిన బిడ్డకు 'నవిష్క' అన్న పేరును పెట్టారు. క్రిస్మస్ నాడు శ్రీజ ఆడ‌బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా పాపకు నామకరణ మహోత్సవం జరుగగా, శ్రీజ భ‌ర్త క‌ల్యాణ్ దేవ్ త‌న సోషల్ మీడియా ఖాతాల్లో పాప పేరును పేర్కొన్నారు.

'మా చిన్నారికి 'నవిష్క' అని పేరు పెట్టాం' అని ఆయన తెలిపారు. ఇక, నవిష్క అంటే నిత్య నూతనం అన్న అర్థం వస్తుంది. ఈ పేరు చాలా బాగుందని, కొత్తగా ఉందని చెబుతూ, మెగా ఫ్యాన్స్ పాపకు, శ్రీజ, కల్యాణ్ దేవ్ లకు అభినందనలు చెబుతున్నారు.

Srija
Kalyan Dev
Navishka
Chiranjeevi
  • Error fetching data: Network response was not ok

More Telugu News