Drunk Driving: 2018లో తగ్గిన డ్రంకెన్ డ్రైవ్ కేసులు... ఫలిస్తున్న పోలీసుల వ్యూహం!

  • 2017లో 8,015 డ్రంకెన్ డ్రైవ్ కేసులు
  • గత సంవత్సరం 5,692కు తగ్గిన కేసులు
  • పట్టుబడితే కాలేజీలు, ఆఫీసులకు లేఖలు పంపుతున్న పోలీసులు

తాగి వాహనాలు నడపవద్దని నచ్చజెప్పినా వినలేదు. ఆపై భారీ జరిమానాలు, చిన్నపాటి జైలుశిక్షలు విధించినా మానలేదు. చివరకు రాచకొండ పోలీసులు తీసుకున్న ఓ నిర్ణయం మందుబాబులను మార్చింది. ముఖ్యంగా విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల మనసు మార్చింది. ఇంతకీ పోలీసులు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? మందు కొట్టి బండి నడుపుతూ పట్టుబడింది విద్యార్థి అయితే పాఠశాలకు, ఉద్యోగి అయితే ఉన్నతాధికారికి లేఖలు రాయడం ప్రారంభించారు. అంతే, ఆఫీసుల్లో విచిత్రంగా చూడటం, కళాశాలలో యాజమాన్యాలు తల్లిదండ్రులను పిలిపించి వారి ముందే చివాట్లు పెట్టడంతో పరువు పోయిందని భావించి మారిపోయారు.

2017లో 8,015 డ్రంకెన్ డ్రైవ్ కేసులు రాచకొండ కమిషనరేట్ పరిధిలో నమోదు కాగా, 2018లో ఆ సంఖ్య 5,692కు తగ్గింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, కౌన్సెలింగ్, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు తదితర ఎన్నో చర్యలు తీసుకున్నా కనిపించని ఫలితాలు, వారి ఘనకార్యాన్ని చెబుతూ, లేఖలు రాయడం ప్రారంభమైన తరువాత కనిపిస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News