Manikarnika: 'మణికర్ణిక' నిర్మాత కమల్ జైన్ కు పక్షవాతం... పరిస్థితి విషమం!

  • వెంటిలేటర్ పై ఉంచి చికిత్సను అందిస్తున్న వైద్యులు
  • మరో ఐదు రోజుల్లో విడుదల కానున్న సినిమా
  • తనకు సమయం బాగాలేదని వ్యాఖ్యానించిన కమల్ జైన్

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించగా, 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' చిత్రాన్ని జీ స్టూడియోస్, కైరోస్ కంటెంట్ స్టూడియోస్ తో కలిసి నిర్మించిన నిర్మాత కమల్ జైన్ కు పక్షవాతం రాగా, ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన్ను వెంటిలేటర్ పై ఉంచి చికిత్సను అందిస్తున్నారు. మరో ఐదు రోజుల్లో 'మణికర్ణిక' విడుదలకు సిద్ధమైన వేళ, కమల్ జైన్ ఇలా ఆసుపత్రిపాలు కావడం దురదృష్టకరం. ఆయన తన పరిస్థితిని గురించి ట్విట్టర్ లో కామెంట్ పెడుతూ, తనకు సమయం బాగాలేదని, త్వరలోనే కోలుకుని, సినిమా విజయాన్ని ఆస్వాదిస్తానన్న నమ్మకం ఉందని అన్నారు. సాధ్యమైనంత త్వరగా తాను కోలుకుంటానని చెప్పారు.

Manikarnika
Kamal Jain
Producer
  • Loading...

More Telugu News