Telugudesam: టీడీపీ నేతలు దాడులు ఆపకుంటే తీవ్రంగా ప్రతిఘటిస్తాం!: వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి వార్నింగ్

  • టీడీపీ నేతలు మాపై దౌర్జన్యం చేస్తున్నారు
  • అధికారం అండతో జులుం ప్రదర్శిస్తున్నారు
  • కడప జిల్లాలో వైసీపీ శ్రేణుల ఆందోళన

టీడీపీ నేతలు తమపై దౌర్జన్యం చేస్తున్నారనీ, దాడులు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ నేతలు ఈరోజు కడప జిల్లాలో ఆందోళనకు దిగారు. కమలాపురం నియోజకవర్గంలోని ఎమ్మార్వో కార్యాలయం ముందు ‘టీడీపీ నేతల దౌర్జన్యం, గూండాగిరి నశించాలి’ అంటూ నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత వైఎస్ వివేకానందరెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ నేతలు జులుం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ శ్రేణులపై దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులు,దౌర్జన్యాలు మరోసారి పునరావృతం అయితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.

Telugudesam
YSRCP
Kadapa District
agitation
ys viveka
ravindranath reddy
  • Loading...

More Telugu News