priyanka chopra: ‘ప్రియాంక-నిక్ జోన్స్’పై సోషల్ మీడియాలో మెమె.. తీవ్రంగా మండిపడ్డ చిన్మయి శ్రీపాద!

- సోషల్ మీడియాలో 10 ఇయర్స్ ఛాలెంజ్
- నిక్-ప్రియాంకపై రూపొందించిన వ్యక్తులు
- అసహ్యంగా ఉందని చెప్పిన చిన్మయి
ప్రస్తుతం సోషల్ మీడియాను ‘10 year challenge’ ఓ ఊపు ఊపేస్తోంది. ఇందులో భాగంగా పదేళ్ల క్రితం తాము ఎలా ఉన్నాం? ఇప్పుడు ఎలా మారాము? అన్నదాన్ని ఫొటోలు తీసి తమ సోషల్ మీడియా ఖాతాల్లో నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు సెలబ్రిటీల ఫొటోలతో మెమెలను షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోన్స్ పై సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఓ మెమెపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తీవ్రంగా మండిపడ్డారు.
