srikanth addala: శ్రీకాంత్ అడ్డాల నుంచి 'కూచిపూడివారి వీధి'

  • పరాజయం పాలైన 'బ్రహ్మోత్సవం'
  • గీతా ఆర్ట్స్ బ్యానర్ పై 'కూచిపూడివారి వీధి'
  • కమల్ .. వెంకీల కోసం కొత్త కథ      

ప్రేమకథా చిత్రాలను .. కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అయితే ఆయన నుంచి ఇంతకుముందు వచ్చిన 'బ్రహ్మోత్సవం' పరాజయంపాలు కావడంతో, సహజంగానే ఆయనకి గ్యాప్ వచ్చింది. ఒకటి రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కించడానికి ఆయన ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది.

సంక్రాంతి పండుగకి తన సొంత ఊరు 'రేలంగి'కి వెళ్లిన ఆయన, అక్కడి మీడియాతో మాట్లాడారు. "త్వరలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఒక సినిమా చేయబోతున్నాను .. ఆ సినిమాకి 'కూచిపూడివారి వీధి' అనే టైటిల్ ను అనుకుంటున్నాను. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తాను. ఇక కమల్ .. వెంకటేశ్  కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ చేయాలనే ఉద్దేశంతో కథను సిద్ధం చేస్తున్నాను. ఈ ఏడాది నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం కూడా వుంది" అని ఆయన చెప్పుకొచ్చారు.

srikanth addala
  • Loading...

More Telugu News