Odisha: భువనేశ్వర్ నుంచి విజయవాడకు బస్సు సర్వీసులు.. ప్రారంభించిన సీఎం నవీన్ పట్నాయక్

  • జెండా ఊపి బస్సును ప్రారంభించిన సీఎం పట్నాయక్
  • ప్రయాణికుల సౌకర్యం కోసమేనన్న సీఎం
  • మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తెస్తామని ప్రకటన

ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు రాజధాని ఎక్స్‌ప్రెస్ బస్సు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శుక్రవారం జెండా ఊపి నాలుగు ఓల్వో బస్సు సర్వీసులను ప్రారంభించారు. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యవంతమైన సేవలు అందించేందుకే రాజధాని ఎక్స్‌ప్రెస్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు సీఎం పట్నాయక్ తెలిపారు.

విజయవాడతోపాటు కోల్‌కతా, భంజానగర్, రాజ్ గంగాపూర్, బుర్లా నగరాలకు మరో 23 ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. ఈ హై-ఎండ్ బస్సుల్లో ఉచిత వై-ఫై, సీసీటీవీ, మొబైల్ చార్జింగ్, జీపీఎస్ ట్రాకింగ్, వాటర్ బాటిల్స్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయన్నారు. 

Odisha
Bhubaneswar
Naveen patnaik
Vijayawada
Rajdhani bus
  • Loading...

More Telugu News