Election commission: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ఈసీ సన్నాహాలు

  • మార్చి మొదటి వారంలో షెడ్యూల్ విడుదల
  • ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభం
  • జమ్మూకశ్మీర్‌పై నిర్ణయం తీసుకోని ఈసీ

కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించినట్టు సమాచారం. మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు.. అలాగే ఎన్ని విడతల్లో పోలింగ్ నిర్వహించాలనే విషయమై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.

అయితే జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనే విషయమై మాత్రం ఈసీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌తో పాటే అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోందని సమాచారం.  

Election commission
Loksabha
Andhra Pradesh
Sikkim
Odisha
Arunachal Pradesh
  • Loading...

More Telugu News