Gopal Roi: సార్వత్రిక ఎన్నికల్లో మాది ఒంటరి పోరే!: ఆమ్ ఆద్మీ పార్టీ

  • ఏ పార్టీతీనూ పొత్తు పెట్టుకోం
  • ఇప్పటికీ అహంభావంతోనే ఉంది
  • త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తాం

సార్వత్రిక ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునేది లేదని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, పార్టీ ఢిల్లీ యూనిట్ కన్వీనర్ గోపాల్ రాయ్ తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ ప్రయోజనాల కారణంగా కాంగ్రెస్ అనే విషాన్ని మింగటానికి తాము సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఇప్పటికీ ఆ పార్టీ అహంభావంతోనే ఉందన్నారు. ఈ కారణంగానే తాము కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబోమని గోపాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ, హరియాణా, పంజాబ్‌లలో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని.. త్వరలోనే లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.

Gopal Roi
AAP
Congress
alliance
Delhi
Hariyana
Punjab
  • Loading...

More Telugu News