Telangana: గజ్వేల్ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా!: వంటేరు ప్రతాప్ రెడ్డి

  • కేసీఆర్ ఆహ్వానం మేరకే టీఆర్ఎస్ లో చేరిక
  • వంటేరు రాకను వ్యతిరేకిస్తున్న ప్రభాకర్ రెడ్డి
  • గత ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీచేసిన వంటేరు

తాను తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)లో చేరుతున్నట్లు కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ లో చేరుతున్నానన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ రోజు మధ్యాహ్నం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటానని పేర్కొన్నారు. గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నానని ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణలోని గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి మూడుసార్లు పోటీ చేసిన వంటేరు రెండో స్థానంతోనే సరిపెట్టుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన తెరాస నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఆయన తిరిగి టీఆర్ఎస్ లోనే చేరనుండటం ఆసక్తికరంగా మారింది. అయితే వంటేరు టీఆర్ఎస్ లోకి వస్తానని చెప్పినా తాము చేర్చుకోబోమని పార్లమెంటు సభ్యుడు, టీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే ప్రకటించి, తద్వారా ఆయన రాకపై తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. 

Telangana
gajwel
KCR
TRS
Congress
vanteru
pratap reddy
join
KTR
  • Loading...

More Telugu News