అమెజాన్: నాలుగు రోజులపాటు 'అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్'

  • ఈ నెల 20 నుండి 23 వరకు సేల్ 
  • ప్రైమ్ సభ్యులకు 12 గంటల ముందుగానే సేల్ ప్రారంభం
  • హెచ్.డీ.ఎఫ్.సీ కార్డులపై 10 శాతం డిస్కౌంట్

ప్రముఖ ఆన్ లైన్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఇండియా తన కస్టమర్ల కోసం భారీ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో 'గ్రేట్ ఇండియన్ సేల్' నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 20 నుండి 23వ తేదీ వరకు ఈ సేల్ జరగనుంది. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సేల్ లో భాగంగా వినియోగదారులు ఒకవేళ అమెజాన్ ప్రైమ్ సభ్యులు అయితే వారికి 12 గంటల ముందుగానే ఈ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఏసీలతో పాటు అనేక ప్రోడక్ట్ లపై ఎక్స్చేంజ్ ఆఫర్లు ఉన్నాయి. కాగా, బజాజ్ ఫిన్‌ సర్వ్‌ తో నో కాస్ట్ ఈఎంఐ, హెచ్.డీ.ఎఫ్.సీ కార్డులపై 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా ఉంది.

అమెజాన్
amazon
amazon great indian sale
Tech-News
  • Loading...

More Telugu News