ayodhya: అయోధ్యలో సామాన్యుల బతుకులు చూడండి... ఇలాంటి రామ రాజ్యాన్నే తీసుకొస్తారా?: ప్రకాశ్ రాజ్

  • మీడియా ప్రతినిధులు అయోధ్యను చూడాలి
  • సెంట్రల్ బెంగళూరు నుంచి ప్రకాశ్ రాజ్ పోటీ
  • హిందుత్వ నేతలపై ప్రకాశ్ రాజ్ విమర్శలు

అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై రాజకీయ నేతల వ్యవహారశైలిని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా తప్పుపట్టారు. రామమందిరం నిర్మాణంపై ఢిల్లీ, లక్నోలోని ఏసీ గదుల్లో కూర్చుని నేతలు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయోధ్యలో వీధుల్లో బతుకుతున్న సామాన్యుల జీవన స్థితిని ఓసారి చూడాలని ఆయన మీడియాను కోరారు. వాళ్లు తీసుకురావాలనుకుంటున్న రామరాజ్యం ఇదేనా? అని ప్రశ్నించారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో సెంట్రల్ బెంగళూరు నుంచి ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో బీజేపీతో పాటు హిందుత్వ నేతల వ్యవహారశైలిని ప్రకాశ్ రాజ్ తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.

ayodhya
media
ac rooms
prakash raj
ram rajya
  • Loading...

More Telugu News