nara brahmani: ఇది నిజంగా మా కుటుంబం చేసుకున్న అదృష్టం: నారా బ్రాహ్మణి

  • ఎన్టీఆర్ కు మనవరాలిని కావడం పూర్వజన్మ సుకృతం
  • చిన్నారులు బ్లడ్ క్యాన్సర్ బారిన పడుతున్నారు
  • రోగులకు నాణ్యమైన సేవలు అందిస్తాం

తమ నాయనమ్మ బసవ తారకం పేరుతో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించి ఇంత మంది రోగులకు సేవలందించడం తమ కుటుంబం చేసుకున్న అదృష్టమని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నందమూరి వసుంధర, ఇతర కుటుంసభ్యులు పాల్గొన్నారు. ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం, బ్రాహ్మణి మాట్లాడుతూ, ఎన్టీఆర్ కు మనవరాలిగా పుట్టడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఎంతో మంది చిన్నారులు బ్లడ్ క్యాన్సర్ బారిన పడుతున్నారని, రోగులకు నాణ్యమైన సేవలు అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ కృషి చేస్తుందని తెలిపారు.

nara brahmani
basava tarakam
cancer hospital
nara
  • Loading...

More Telugu News