bride: దేశ రాజధానిలో.. తాళి కట్టించుకుంటున్న సమయంలో పెళ్లికూతురుపై కాల్పులు

  • ఢిల్లీలోని షకర్ పూర్ ప్రాంతంలో ఘటన
  • 19 ఏళ్ల పూజపై కాల్పులు జరిపిన యువకుడు
  • ఆమెకు తెలిసిన యువకుడే కాల్పులు జరిపాడన్న పోలీసులు

వధువు మెడలో తాళికట్టేందుకు వరుడు సిద్ధమవుతున్న సమయంలో... పెళ్లిప్రాంగణం తుపాకీ కాల్పులతో మోతెక్కింది. ఈ ఘటన ఢిల్లీలోని షకర్ పూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. 19 ఏళ్ల  పూజ అనే యువతికి ఓ యువకుడితో పెళ్లి జరుగుతోంది. బాజాభజంత్రీలు, వేదమంత్రాల మధ్య ఆమెకు తాళి కట్టేందుకు వరుడు సిద్ధమవుతున్న సమయంలో... ఓ ఆగంతుకుడు తుపాకీతో పూజపై కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలో పూజ గాయపడింది. గాయపడిన ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, గాయం చిన్నదేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పారు. దీంతో, బంధువులు పెళ్లి తంతును ముగించారు. మరోవైపు, పూజకు తెలిసిన యువకుడే కాల్పులు జరిపి పారిపోయాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రేమ వ్యవహారమే కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

bride
shoot
shot
delhi
  • Loading...

More Telugu News