jagan: జగన్ పై దాడి కేసులో నేడు హైకోర్టులో పిటిషన్ వేయనున్న ఏపీ ప్రభుత్వం

  • కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై ఏపీ ప్రభుత్వ అభ్యంతరం
  • కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేయనున్న ఏపీ ప్రభుత్వం
  • నిన్న ముగిసిన శ్రీనివాసరావు ఎన్ఐఏ కస్టడీ

వైసీపీ అధినేత జగన్ పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కేసు విచారణను ఎన్ఐఏకు అప్పగించడంపై న్యాయపోరాటానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నేడు హైకోర్టులో పిటిషన్ వేయనుంది. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసేందుకు ఏపీ పోలీసులు నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో, ప్రభుత్వ అభ్యర్ధన మేరకు అత్యవసర విచారణకు అనుమతిస్తే రేపు లేదా సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు జగన్ పై దాడి చేసిన శ్రీనివాసరావు ఎన్ఐఏ కస్టడీ నిన్ననే ముగిసింది. ఈరోజు అతడిని ఎన్ఐఏ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. 

jagan
stab
ap
government
high court
nia
  • Loading...

More Telugu News