Jammu And Kashmir: లడక్ లో మంచు చరియలు విరిగి పడి వాహనం సమాధి... భారీ సెర్చ్ ఆపరేషన్ మొదలు!

  • 10 మందితో ప్రయాణిస్తున్న స్కార్పియో సమాధి 
  • ఘటనా స్థలికి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 
  • ప్రారంభమైన వెతుకులాట

జమ్మూ కాశ్మీర్ లోని లడక్ ప్రాంతంలో మంచు చరియలు విరిగిపడటంతో 10 మందితో ప్రయాణిస్తున్న ఓ వాహనం వాటికింద సమాధి అయింది. ఈ ఉదయం ఘటన జరుగగా, వాహనంలోని వారిని రక్షించేందుకు సైన్యం భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. సముద్ర మట్టానికి 17,500 అడుగుల ఎత్తున ఈ ఘటన జరిగింది. విషయం తెలియగానే జిల్లా అధికారులు పోలీసులను ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్) బృందాలను ఘటనా స్థలికి పంపారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, ఈ వాహనం ఓ స్కార్పియో అని తెలుస్తోంది. ఇండియాలోని అత్యంత ఎత్తున ఉన్న రహదారుల్లో ఖాండుంగ్ లా రహదారి కూడా ఒకటి. లేహ్ కు ఉత్తర ప్రాంతంలో షయోక్, నుబ్రా లోయలను కలుపుతూ ఈ రహదారి ఉంటుంది. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News