ntr: ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోంది.. ఆయన్ను చంపినవాళ్లు బయటే తిరుగుతున్నారు!: లక్ష్మీపార్వతి

  • ఎన్టీఆర్ ఎన్నటికీ ఆరాధ్యుడే
  • నా గుండెల్లో మంటలింకా చల్లారలేదు
  • నేడు ఎన్టీఆర్ 23వ వర్ధంతి

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో ఆరాధ్యుడేనని ఆయన భార్య లక్ష్మీపార్వతి అన్నారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ఆత్మ శాంతించలేదనీ, ఘోషిస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ను చంపినవాళ్లు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆమె ఆరోపించారు. తన గుండెల్లో మంట ఇంకా చల్లారలేదనీ, కన్నీరు ఆరలేదని లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్ మహిళలను అమితంగా గౌరవిస్తే.. ప్రస్తుతం టీడీపీ మాత్రం మహిళలను అవమానిస్తోందని దుయ్యబట్టారు. నేడు ఎన్టీఆర్ 23వ వర్ధంతి సందర్భంగా లక్ష్మీపార్వతి ఈ మేరకు స్పందించారు.

ntr
Telugudesam
Andhra Pradesh
lakshmi parvathi
23rd death anniversary
  • Loading...

More Telugu News