Telangana: వంటేరు వస్తానన్నా మేం చేర్చుకోవాలిగా?: టీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి

  • 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్‌ చేతిలో ఓటమి
  • నేడు టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు వార్తలు
  • ఖండించిన కొత్త ప్రభాకర్ రెడ్డి

గజ్వేల్ కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలపై టీఆర్ఎస్ నేత, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. వంటేరు పార్టీలోకి వస్తానంటే తీసుకునేవారు ఎవరూ లేరని తేల్చి చెప్పారు. ప్రతాప్ రెడ్డి కావాలనే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో చేరాలంటూ ఆయనను ఎవరూ సంప్రదించలేదని  పేర్కొన్నారు. ఆయన కావాలనే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.  

ఇటీవల తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై గజ్వేల్‌లో పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున కేసీఆర్‌పైనే పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా, ఆయన టీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు గురువారం సాయంత్రం ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. నేటి సాయంత్రం కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Telangana
TRS
vanteru pratap reddy
kotha prabhakar reddy
Medak District
  • Loading...

More Telugu News