ap: ఏపీ ఎన్నికల ప్రధానాధికారి బదిలీ.. గోపాలకృష్ణ ద్వివేది నియామకం

  • ఆర్పీ సిసోడియాను బదిలీ చేసిన ఈసీ
  • త్వరలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు 
  • ఎన్నికల ముందు బదిలీపై కొనసాగుతున్న చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆర్పీ సిసోడియాను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. ఆయన స్థానంలో గోపాలకృష్ణ ద్వివేదిని నియమించింది. ఇటీవలే ఏపీలో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. మార్పులు, చేర్పులు చేసుకోవడానికి ప్రజలకు అవకాశం కల్పించింది. మరోవైపు, త్వరలోనే ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో సిసోడియాను ఈసీ బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. 

ap
election commission
ceo
transfer
  • Loading...

More Telugu News