Telangana: టీఆర్ఎస్ లో చేరనున్న ఒంటేరు ప్రతాప్ రెడ్డి?

  • కాంగ్రెస్ పార్టీని వీడనున్న ఒంటేరు
  • ఒంటేరుకు టీఆర్ఎస్ కండువా కప్పనున్న కేసీఆర్
  • ఇటీవలి ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేసి ఓడిన ఒంటేరు

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పై గజ్వేల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి అపజయం పాలైన ఒంటేరు ప్రతాప్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించిన ఒంటేరు, కాంగ్రెస్ ను వీడి, ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరనున్నట్టు సమాచారం. కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువాను ఆయన కప్పుకోనున్నారు. రేపు సాయంత్రం నిర్వహించే ఓ కార్యక్రమంలో ఒంటేరుకు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్ లోకి కేసీఆర్ ఆహ్వానించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, 2014 ఎన్నికల్లో సైతం గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేసి ఆయన ఓటమిపాలయ్యారు. 

Telangana
kcr
TRS
onteru
pratapreddy
  • Loading...

More Telugu News