bonda uma: పవన్ కల్యాణ్ మాతో కలసి రావాలి: టీడీపీ నేత బొండా ఉమ

  • కేసీఆర్ ఇచ్చే డబ్బు కోసం జగన్ ఆరాటపడుతున్నారు
  • ఏపీలో ఒక డమ్మీ ఉండాలని మోదీ, కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు
  • టీఆర్ఎస్ తో పొత్తుపై జగన్ వివరణ ఇవ్వాలి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే డబ్బుల కోసం వైసీపీ అధినేత జగన్ ఆరాటపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ వ్యాఖ్యానించారు. బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చేందుకే ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ నాటకం ఆడుతున్నారని చెప్పారు. ఏపీలో ఒక డమ్మీ ఉండాలని ప్రధాని మోదీ, కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. అందుకే జగన్ ను ఎంపిక చేసుకున్నారని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ లతో చేతులు కలిపిన వైసీపీకి వ్యతిరేకంగా జనసేనాని పవన్ కల్యాణ్ టీడీపీతో కలసి రావాలని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను వ్యతిరేకించిన టీఆర్ఎస్ తో పొత్తుపై జగన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

bonda uma
kcr
jagan
Pawan Kalyan
Telugudesam
janasena
TRS
YSRCP
  • Loading...

More Telugu News