jaggareddy: నాకు కేసీఆర్ అవసరం ఉంది: జగ్గారెడ్డి

  • నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్ అవసరం నాకు ఉంది
  • కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇచ్చేంత వరకు వేచి చూస్తా
  • నా నియోజకవర్గానికి వస్తే సన్మానం చేస్తా

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తన అవసరం లేదని... కానీ, ఆయన అవసరం తనకుందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల కోసం సీఎం అవసరం ఉందని చెప్పారు. కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇచ్చే వరకు వేచి చూస్తానని తెలిపారు. తన నియోజకర్గానికి కేసీఆర్ వస్తే సన్మానం చేస్తానని చెప్పారు. ఆయన రాకపోతే మౌనంగా ఉంటానని అన్నారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడవద్దని మా వాళ్లకు కూడా చెప్పానని తెలిపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అందరూ గౌరవించాల్సిందేనని చెప్పారు. 

jaggareddy
congress
kcr
TRS
  • Loading...

More Telugu News