KCR: తలా, తోకాలేని ఈ మాటలెందుకు?: టీడీపీపై గుత్తా విసుర్లు

  • కేసీఆర్ ఆదేశాల మేరకే కేటీఆర్ జగన్ వద్దకు వెళ్లారు
  • రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయనడం అర్థరహితం
  • జగన్ కు ఉన్న ప్రజాదరణను చూడలేకనే టీడీపీ విమర్శలు

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసే కృత నిశ్చయంతో ఉన్న కేసీఆర్ ఆదేశాల మేరకు నిన్న కేటీఆర్, స్వయంగా వెళ్లి జగన్ తో మాట్లాడి వస్తే, టీడీపీ నేతలు తలా, తోకాలేని విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్, వైసీపీ పొత్తు పెట్టుకున్నాయని వారు చేస్తున్న విమర్శలు అర్థరహితమని అన్నారు.

 నేడు మీడియాతో మాట్లాడిన ఆయన, ఏపీలో వైఎస్‌ జగన్‌ కు ఉన్న ప్రజాదరణ చూసి తెలుగుదేశం నేతలు ఓర్వలేకపోతున్నారని, అందువల్లే వైసీపీపై విషప్రచారానికి దిగారని విమర్శలు గుప్పించారు. బీజేపీతో నాలుగు సంవత్సరాలు పొత్తు పెట్టుకుని, ఇప్పుడు టీడీపీ నేతలు శ్రీరంగ నీతులు చెబుతున్నారని నిప్పులు చెరిగిన ఆయన, తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్‌ లను ప్రజలు తిరస్కరించారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఏపీలోనూ టీడీపీ, కాంగ్రెస్‌ కూటమిని ప్రజలు తిరస్కరించడం ఖాయమని అన్నారు.

KCR
KTR
Jagan
Gutta Sukhender Reddy
Chandrababu
Telugudesam
TRS
YSRCP
  • Loading...

More Telugu News