Vikarabad District: గుప్తనిధుల కోసం తవ్వకాలు... వికారాబాద్ సమీపంలో బయటపడిన విలువైన సంపద!

  • కోటపల్లి మండలం నాగ్‌ సాన్‌ పల్లిలో తవ్వకాలు
  • పంచలోహ విగ్రహాలు, నాణాలు వెలుగులోకి
  • నిందితులను ప్రశ్నిస్తున్న పోలీసులు

వికారాబాద్‌ జిల్లా కోటపల్లి మండలం నాగ్‌ సాన్‌ పల్లిలో కొందరు గుప్త నిధుల కోసం జరిపిన తవ్వకాల్లో విలువైన సంపద బయటపడటం కలకలం రేపింది. ఈ విషయం బయటకు పొక్కడంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. గ్రామానికి చెందిన కొంతమంది, బయటి నుంచి కిరాయికి మనుషులను పిలిపించి, గ్రామంలోని పురాతన ఆలయం వద్ద తవ్వకాలు జరిపినట్టు సమాచారం.

తవ్వకాల్లో పురాతన నాణాలు, పంచలోహ విగ్రహాలతో పాటు రాగి పాత్రలు తదితరాలు బయట పడ్డాయి. ఈ విషయం ఆనోటా, ఈనోటా పాకి, పోలీసుల దృష్టికి వెళ్లింది. కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు, గుప్త నిధుల విషయాన్ని నిర్ధారించడానికి నిరాకరిస్తున్నారు. నిందితుల వివరాలను, లభ్యమైన వస్తువుల విలువను గోప్యంగా ఉంచారు.

Vikarabad District
Nagsanpalli
Old Temple
  • Loading...

More Telugu News