Odisha: ఒడిశాలో కాంగ్రెస్‌కు షాక్‌... బీజేడీలో చేరుతున్నట్లు ప్రకటించిన పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కిశోర్‌దాస్‌

  • పార్టీకి రాజీనామా చేసిన  ఝర్సుగుడ ఎమ్మెల్యే
  • ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్న కిశోర్‌
  • నియోజకవర్గం అభివృద్ధి కోసమేనని ప్రకటన

ఒడిశా రాష్ట్ర కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఝర్సుగుడ ఎమ్మెల్యే నబ కిశోర్‌దాస్‌ కాంగ్రెస్‌ పార్టీ పదవికి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్ష పదవితోపాటు ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం వదులుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీకి తన రాజీనామా లేఖ పంపారు.

పార్టీలో తనకు ఎవరితోనూ విరోధం లేదని, నియోజక వర్గం అభివృద్ధి కోసం తాను అధికార బిజూ జనతాదళ్‌ (బీజేడీ)లో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే ఎమ్మెల్యే పదవికి మాత్రం ఆయన రాజీనామా చేయలేదు. రెండు మూడు నెలల్లో ఒడిశా అసెంబ్లీతోపాటు లోక్‌సభకు  ఎన్నికలు జరగనున్న తరుణంలో కిశోర్‌దాస్‌ నిష్క్రమణ కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురు దెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు. తాను ఈనెల 24న బీజేడీలో చేరనున్నట్లు కిశోర్‌దాస్‌ ప్రకటించారు.

Odisha
Congress
working president kishore
  • Loading...

More Telugu News