: ఢిల్లీ సీఎంకు ముడుపుల ఆఫర్


ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కు ఇటీవల ఒక ఊహించని సంఘటన ఎదురైంది. ఒక రోజు పార్టీ నేత ఒకరు షీలా దగ్గరకు వచ్చాడు. నవ్వులు చిందిస్తూ నమస్కారాలు ఒలికిస్తూ ఒక పాకెట్ చేతిలో పెట్టాడు. స్వీట్లు ఇస్తున్నాడేమో అనుకున్న షీలా వాటిని స్వీకరించారు. కొంతసేపటి తర్వాత అతడే కల్పించుకుంటూ అందులో క్యాష్ ఉంది. నాకు పార్టీ టికెట్ కావాలి అని అసలు కబురు చల్లగా చెప్పాడు. అది విన్న వెంటనే షీలాకు పట్టరాని కోపం వచ్చిందట. ఈ విషయాన్ని షీలా స్వయంగా ఒక టీవీ చానల్ తో చెప్పారు. అలాంటి అవినీతి నేతలను శిక్షించాలంటూ ఆమె తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News