Jagan: కేటీఆర్ రాకకోసం ఎదురుచూస్తున్న వైఎస్ జగన్!

  • జగన్ ఇంటికి బయలుదేరిన కేటీఆర్
  • కాస్తంత ఆలస్యంగా భేటీ
  • అనంతరం విడివిడిగా మీడియాకు ప్రకటనలు!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తో భేటీ అయ్యేందుకు ఎంపీ వినోద్ తదితరులతో కలిసి కేటీఆర్ తన ఇంటి నుంచి బయలుదేరారు. మరికాసేపట్లో ఆయన లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి చేరుకోనుండగా, ఆయనకు స్వయంగా ఆహ్వానం పలికి లోపలికి తీసుకెళ్లేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారు.

కేసీఆర్ ప్రారంభించిన ఫెడరల్ ఫ్రంట్ పై చర్చిస్తూ, వీరు మధ్యాహ్న భోజనాన్ని కలిసి చేయనున్న సంగతి తెలిసిందే. జగన్ ఇంటివద్ద ప్రస్తుతం తెలుగు మీడియాతో పాటు, జాతీయ మీడియా సైతం భారీ ఎత్తున మోహరించింది. భేటీ అనంతరం టీఆర్ఎస్ తరఫున, వైకాపా తరఫున విడివిడిగా మీడియాకు ప్రకటనలు విడుదలవుతాయని తెలుస్తోంది. వాస్తవానికి 12.30 గంటలకే కేటీఆర్, జగన్ నివాసానికి చేరుకోవాల్సివుండగా, కాస్తంత ఆలస్యంగా ఈ భేటీ జరుగుతుందని సమాచారం.

Jagan
KTR
Hyderabad
Lotus Pond
  • Loading...

More Telugu News