Andhra Pradesh: వైఎస్ షర్మిలపై దుష్ప్రచారం.. చంద్రబాబు తీరును విమర్శించిన సీపీఐ నేత రామకృష్ణ!

  • ఏపీ సీఎం స్పందన సరికాదని వ్యాఖ్య
  • జగన్, కేసీఆర్ మోదీ కోసం పనిచేస్తున్నారని విమర్శ
  • ఏపీలో టీఆర్ఎస్ సాయంపై తలసానికి ప్రశ్న

తెలంగాణలో టీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ ఏం చేశారో చెప్పాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఏపీలో ఎవరితో కలిసి పనిచేస్తారని ప్రశ్నించారు. ఏపీలో బలమైన పార్టీతో కలిసి పనిచేస్తామని తలసాని గతంలో చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ మేరకు స్పందించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్, జగన్ మోదీకి అనుకూలంగా పనిచేస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

వైఎస్ జగన్ సోదరి షర్మిలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని రామకృష్ణ డిమాండ్ చేశారు. షర్మిల ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించిన తీరు సరిగ్గా లేదని విమర్శించారు.

Andhra Pradesh
Telangana
YSRCP
Telugudesam
KCR
Jagan
Narendra Modi
cpi
ramakrishana
ys sharmila
  • Loading...

More Telugu News