Telangana: జనగామలో దారి కాచి.. లిక్కర్ షాపు సిబ్బంది నుంచి దోపిడీ!

  • నగదు ఇవ్వాలని బెదిరింపులు
  • ఒప్పుకోనందుకు గాల్లోకి కాల్పులు
  • రూ.6.7 లక్షలు కాజేసిన దొంగలు

తెలంగాణలోని జనగామ జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఓ వైన్ షాపును మూసేసి వెళుతున్న సిబ్బందిపై కాల్పులు జరిపారు. అనంతరం వారి దగ్గరున్న నగదును తీసుకుని పరారయ్యారు. జిల్లాలోని మొండ్రాయి గ్రామంలో తిరుమల వైన్ షాపును నిన్న రాత్రి మూసివేసి వెళుతున్న ముగ్గురు సిబ్బందిని కొందరు దుండగులు అటకాయించారు.

మర్యాదగా నగదును ఇవ్వాలని కోరారు. సిబ్బంది ప్రతిఘటించడంతో వాళ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం సిబ్బంది వద్ద ఉన్న రూ.6.70 లక్షల నగదును తీసుకుని పరారయ్యారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Telangana
janagama
district
theft
liqour shop
Police
  • Loading...

More Telugu News