lawrence: 'కాంచన 3' మోషన్ పోస్టర్ కి అనూహ్యమైన రెస్పాన్స్

  • లారెన్స్ నుంచి 'కాంచన 3'
  • హారర్ థ్రిల్లర్ గా సాగే కథ 
  • ప్రతినాయకుడిగా కబీర్ దుహాన్ సింగ్      

హారర్ థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడంలో లారెన్స్ సిద్ధహస్తుడు. గతంలో ఆయన తెరకెక్కించిన 'కాంచన' .. 'గంగ' సినిమాలకు విశేషమైన ఆదరణ లభించింది. తమిళంతో పాటు తెలుగులోను ఆయన సినిమాలు భారీ వసూళ్లను అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన 'కాంచన 3'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ఇటీవల వదిలిన ఈ సినిమా ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో సంక్రాంతి పండుగ సందర్భంగా నిన్న మోషన్ పోస్టర్ ను వదిలారు. ఒక్క రోజులోనే ఈ మోషన్ పోస్టర్ కి 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ సందర్భంగా సన్ పిక్చర్స్ వారు .. లారెన్స్ .. అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ హారర్ థ్రిల్లర్ లో లారెన్స్ జోడీగా ఓవియా .. వేదిక కథానాయికలుగా సందడి చేయనున్నారు. కబీర్ దుహాన్ సింగ్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.

  • Loading...

More Telugu News