KCR: కేసీఆర్ చెప్పారు, నేను వెళుతున్నాను: జగన్ తో భేటీపై కేటీఆర్

  • కేసీఆర్ ఆదేశాల మేరకు జగన్ ను కలుస్తున్నా
  • మధ్యాహ్నం 12.30 గంటలకు భేటీ
  • ట్విట్టర్ లో వెల్లడించిన కేటీఆర్

"మా నాయకుడు కేసీఆర్ ఆదేశాల మేరకు, నేను ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గారిని కలవనున్నాను. మధ్యాహ్నం 12.30 గంటలకు వెళ్లనున్నాను. ఎన్టీయే, యూపీఏలకు ప్రత్యామ్నాయంగా ఏర్పడుతున్న ఫెడరల్ ఫ్రంట్ ను బలోపేతం చేయడంపై చర్చించనున్నాను" అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్విట్టర్ లో ఓ ట్వీట్ పెట్టారు. కాగా, నేడు కేటీఆర్ తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు జగన్ ఇంటికి వెళ్లనుండగా, వారికి మధ్యాహ్న భోజన విందును జగన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.



KCR
KTR
Jagan
Lunch
Meeting
Twitter
  • Loading...

More Telugu News