Ramgopal Varma: రామ్ గోపాల్ వర్మ తన కాళ్లకు మొక్కారంటూ ఫొటో విడుదల చేసిన కేఏ పాల్... 'ప్రభువా...' అంటూ స్పందించిన వర్మ!

  • వర్మ, కేఏ పాల్ ల మధ్య సెటైర్ల కామెంట్లు
  • ముంబైలో తన కాళ్లు పట్టుకున్నారన్న పాల్
  • వెనక్కు లాగి పడేసి, బుర్ర సెట్ చేద్దామనుకున్నానన్న వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, కేఏ పాల్ ల మధ్య సెటైర్ల కామెంట్లు మరో మెట్టెక్కాయి. గతంలో పాల్ పై వర్మ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా, రామ్ గోపాల్ వర్మ, ముంబైలో తనను కలిసి తన కాళ్లు పట్టుకున్నారని చెబుతూ ఓ ఫొటోను విడుదల చేయగా, దానిపై వర్మ స్పందించాడు.

 "వావ్... ఆర్జీవీ ముంబై హోటల్‌ లో నన్ను కలిసి నా పాదాలకు నమస్కారం చేశారు. తన గురువు దాసరిగారి కాళ్లను కూడా తానెప్పుడూ అలా పట్టుకోలేదని చెప్పారు. ఆ సమయంలో అక్కడే ఉండి ఇది చూసిన జ్యోతి, వెంకట్ షాక్ అయ్యారు. నన్ను నా ఏపీ ప్రజలు నాలుగు నెలల్లో సీఎంని చేస్తారు. ఆ వెంటనే మేము ప్రపంచంలోనే ది బెస్ట్ అని అనిపించుకుంటాం. ఆ తరువాత దేశం గురించి చూస్తాం" అని కేఏ పాల్ ట్వీట్ చేశారు.

 ఇక దీనిపై వర్మ కౌంటర్ ఇస్తూ, "ప్రభువా..! నేను పాల్ కాళ్లు ముట్టుకోలేదు. జస్ట్ పట్టుకుని వెనక్కి లాగితే వెనక్కి పడి, తల నేలకు తగిలి, బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా. కానీ మీరు హర్ట్ అవుతారేమోనని వదిలేశా" అని అన్నారు. వీరిద్దరి కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Ramgopal Varma
KA Paul
Foot
Mumbai
Comments
  • Error fetching data: Network response was not ok

More Telugu News