Tamilnadu: నగదు డిపాజిట్ మిషన్‌లో నకిలీ నోట్లను జమచేసిన మహిళ.. గాలిస్తున్న పోలీసులు

  • రూ. 30 వేల విలువైన నకిలీ నోట్లను జమ చేసిన మహిళ
  • గుర్తించిన సిబ్బంది
  • తమిళనాడులోని వేలూరులో ఘటన

ఏటీఎం సెంటర్‌లోని నగదు డిపాజిట్ మెషీన్‌లో నకిలీ నోట్లు జమ చేసిన మహిళ కోసం తమిళనాడులోని వేలూరు పోలీసులు గాలిస్తున్నారు. ఈ నెల ఎనిమిదో తేదీన బాగాయం స్టేట్ బ్యాంకు బ్రాంచిలో ఓ మహిళ రూ. 30 వేల విలువైన నకిలీ నోట్లను తన ఖాతాలో జమ చేసి వెళ్లిపోయింది. ఏటీఎంలో నగదు నింపేందుకు వచ్చిన సిబ్బంది నకిలీ నోట్లను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగదు జమ చేసిన ఖాతా నంబరు, పేరు వివరాలను సేకరించిన పోలీసులు అది ఓ మహిళ ఖాతాగా గుర్తించి ఆమె కోసం గాలిస్తున్నారు.

Tamilnadu
SBI
Fake notes
woman
police
  • Loading...

More Telugu News