Bharath: ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. భారత ఫుట్ బాల్ జట్టు కోచ్ రాజీనామా

  • బెహ్రైన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి
  • ఆసియా కప్-2019 నుంచి భారత్ నిష్క్రమణ
  • రాజీనామా చేసిన కోచ్ స్టీఫెన్ 

'ఆసియా కప్-2019'లో భాగంగా సోమవారం బెహ్రైన్‌తో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్‌లో 0-1 తేడాతో భారత్ జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో టోర్నమెంట్ నుంచి భారత్ నిష్క్రమించింది. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ జట్టు కోచ్ స్టీఫెన్ కాన్ స్టాన్ టైన్ తన పదవికి రాజీనామా చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నాలుగేళ్లుగా నేను భారత్ ఫుట్ బాల్ జట్టుకు కోచింగ్ ఇస్తున్నాను. ఈ నాలుగేళ్లలో మేం చాలా సాధించాము.. ఎన్నో రికార్డులు సాధించాము. ప్రతీ ఆటగాడికి నేను రుణపడి ఉంటాను. నా కాలం ముగిసింది. నేను ఇచ్చిన మాట కోసం చాలా కష్టపడ్డాను.. ఫలితం కూడా అలానే వచ్చింది’’ అని స్టీఫెన్ తెలిపారు.

Bharath
Behrain
Asia Cup-2019
Stephen Contesten
  • Loading...

More Telugu News