ram shindey: కర్ణాటకలో 'ఆపరేషన్ లోటస్' విజయవంతమవుతుంది: బీజేపీ
- కర్ణాటలో కమలం వికసిస్తుందన్న రామ్ షిండే
- ఇప్పటికే ఇద్దరు ఇండిపెండెంట్లు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు
- బీజేపీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు
కర్ణాటకలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆపరేషన్ లోటస్ (కమలం)ను బీజేపీ పూర్తి స్థాయిలో అమలు చేస్తోంది. ఇప్పటికే, జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఇద్దరు ఇండిపెండెంట్లు తమ సపోర్టును ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ దూకుడు చూస్తుంటే... సంకీర్ణ ప్రభుత్వం నిలబడుతుందా? లేక పడిపోతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మహారాష్ట్ర బీజేపీ కీలక నేత రామ్ షిండే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వేడిని మరింత పెంచుతున్నాయి.
కర్ణాటకలో ఆపరేషన్ లోటస్ విజయవంతమవుతుందని షిండే సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్-జేడీఎస్ పాలిస్తున్న దక్షిణాది రాష్ట్రంలో త్వరలోనే కమలం వికసించబోతోందని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వానికి ఇద్దరు ఇండిపెండెంట్లు మద్దతును ఉపసంహరించుకున్నారని... ప్రజలు పట్టం కట్టిన బీజేపీకే మద్దతివ్వాలని వారు అనుకుంటున్నారని తెలిపారు.